ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొన్ని కొన్ని మంచి నిర్ణయాలే తీసుకుంటున్న కొన్ని కొన్ని విషయాలలో మాత్రం తెలియకుండానే తప్పులు చేసి విపక్షాలకు అడ్డంగా బుక్కైంది. అయితే ఏ పార్టీ అయిన అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భవనాలకు, పంచాయితీ భవనాలకు ఆ పార్టీ రంగులు వేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు స్మశానాలకు, వాటర్ ట్యాంకులకు కూడా పసుపు రంగులు వేయించుకుంది. అయితే ఈ సారి వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ రంగులు చెరిపి వైసీపీ రంగులు వేయించుకుంది.
అయితే గుంటూర్ జిల్లా వట్టి చెరుకూరు పల్లపాడు పంచాయితీ భవనానికి వైసీపీ జెండా రంగులు వేయించడంపై హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలయ్యింది. అయితే ఈ పిటీషన్‌పై నేడు విచారణ జరిపిన హైకోర్ట్ వైసీపీ సర్కార్‌కి షాక్ ఇచ్చింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడాన్ని హైకోర్ట్ తప్పుపట్టింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి 10 రోజులలో వివరణ ఇవ్వాలని కోర్ట్ గుంటూర్ కలెక్టర్‌ను ఆదేశించింది.