టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. డ్రగ్స్ కేసులో ఈడీ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో కోర్టు ధిక్కరణ ఆరోపణలపై సీఎస్ సోమేశ్ కుమార్, ఎక్సైజ్ డైరెక్టర్ సర్ఫరాజ్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ విషయంపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ఈ సందర్భంగా నిందితుల కాల్ డేటా, డిజిటల్ రికార్డులు ఇవ్వట్లేదని ఈడీ ఆరోపణ చేసింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించట్లేదని కోర్డుకు ఈడీ తెలిపింది. దీంతో వారికి కోర్టు ధిక్కరణ శిక్ష విధించాలని సూచించింది. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను ఈనెల 25కు వాయిదా కోర్టు వేసింది.