ఆంధ్రప్రదేశ్ లో ఓ పక్క కరోనా మరోపక్క రాజకీయాలు చాలా తీవ్రంగా సాగుతున్నాయి. దీనిపై పోటాపోటీగా ప్రభుత్వం.. విపక్ష పార్టీల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపు వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తర్వాత విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్‌ను ఈ నెల 24లోపు కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపును సవాలు చేస్తూ వేసిన పిటిషన్లను విచారించిన ధర్మాసనం… నిమ్మగడ్డతో పాటు మొత్తం 8పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఈసీ తొలగింపు వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది. ఫైనల్ కౌంటర్ శుక్రవారంలోపు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. కాగా ఈ నెల 27లోపు పిటిషన్ దారులు రిప్లే పిటిషన్లు దాఖలు చేయాలని తెలిపింది హైకోర్ట్.