సింగరేణి ఎన్నికలపై హైకోర్టులో నేడు కీలక విచారణ జరుగనుంది. సింగరేణిలో ఈ నెల 28న ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధం అయింది. అయితే.. ఈ ఎన్నికలపై హై కోర్టు డివిజన్ బెంచ్ లో సింగరేణి యాజమాన్యం అప్పీల్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల కారణంగా సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి యాజమాన్యం కోరుతోంది.
గత ఏడాది నుంచి హై కోర్ట్ లో నే సింగరేణి ఎన్నిక వివాదం ఉంది. ఎన్నికల నిర్వహణ పై గడువు పొడగిస్తు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఇప్పటికే 3 సార్లు ఉత్తర్వులు జారీ చేసిన హై కోర్టు…జూన్ 23 న సింగరేణి ఎన్నికల పై కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహించల్సిందిగా సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వుల పై చీఫ్ కోర్ట్ లో సింగరేణి యాజమాన్యం అప్పీల్ చేసింది. ఇక నేడు సింగరేణి ఎన్నిక పై హై కోర్ట్ తీర్పు వెలువడే అవకాశం ఉంది.