రవితేజని ట్రోల్ చేస్తున్న యశ్ ఫ్యాన్స్…

రవితేజని ట్రోల్ చేస్తున్న యశ్ ఫ్యాన్స్…
Latest News

మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు . వరుస సినిమాలో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు రవితేజ. ప్రస్తుతం రవితేజ మూవీ ల తో బిజీగా ఉన్నారు త్వరలోనే రవితేజ హీరోగా టైగర్ నాగేశ్వరరావు మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ మూవీ దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకులు ముందుకి రాబోతుంది . అయితే ఆ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. రవితేజ నటించిన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వబోతుంది . అందుకని రవితేజ ప్రమోషన్స్ పై దృష్టిపెట్టారు. జాతీయ మీడియాతో కూడా రవితేజ ఇంటర్వ్యూలు ఇచ్చారు.

రవితేజని ట్రోల్ చేస్తున్న యశ్ ఫ్యాన్స్…
Ravi Teja

రవితేజ కి ఈ క్రమంలో హీరోల గురించి కొన్ని ప్రశ్నలు ఎదురవ్వగా.. రవితేజ మాట్లాడుతూ రామ్ చరణ్, విజయ్ డాన్స్ లు అంటే ఇష్టం అని చెప్పారు అలానే రాజమౌళి ఒక విజన్ అని చెప్పుకొచ్చారు . ప్రభాస్ నిజంగానే డార్లింగ్ అని చెప్పారు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ యష్ గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం ట్రోల్స్ కి గురి చేస్తోంది. యష్ నటించిన సినిమాలేవి చూడలేదని రవితేజ అన్నారు. యష్ కి కేజీఎఫ్ దొరకడం అదృష్టం అని రవితేజ అన్నాడు . దాంతో యశ్ ఫాన్స్ ఒకప్పుడు కన్నడ మూవీ లో సైడ్ యాక్టర్ గా పనిచేసిన నువ్వే కేజిఎఫ్ మూవీ యష్ అదృష్టం అని కామెంట్ చేయడం ఏమాత్రం బాలేదని విపరీతంగా ట్రోల్ చేస్తున్నాడు . రవితేజ ఫాన్స్ అయితే అందులో తప్పేముందని రవితేజ కి సపోర్ట్ కూడా ఇస్తున్నారు.