జగన్ పాదయాత్రలో ఉద్రిక్తత…కాపు సెగ !

high tension at jagan padayatra

అనవసరంగా ఎరక్కపోయి కాపుల విషయంలో ఒక మాట తూలేసి జగన్ ఇప్పుడు ఇరుక్కుపోయినట్టు కనిపిస్తోంది. సుమారు వారం రోజుల క్రితం  కాపు రిజర్వేషన్లలపై జగన్ చేసిన ప్రకటన కలకలం రేపింది. ఆ వర్గం నుంచి ఆయనకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాపు రిజర్వేషన్లు నా చేతిలో ఏమీ ఉండదని అది కేంద్రం పరిధిలోని అంశం చెప్పిన జగన్‌కు ఆ వర్గం నుంచి ఊహించని రీతిలో నిరసన ఎదురైంది.  ఈరోజు తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో సాగుతున్న జగన్ పాదయాత్రకు కాపుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. చేబ్రోలులో సాగుతున్న జగన్ పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. కాపు రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన యువకులు నల్లజెండాలతో నిరసన తెలిపారు. వాటర్ ట్యాంకు పైకెక్కి ఆందోళన చేశారు. జగన్ మాత్రం ఈ విషయం మీద ఏమీ మాట్లాడకుండా మౌనంగా పాదయాత్రను సాగించారు.