Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై హిల్లరీ క్లింటన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తో పోటీపడి ఓటమి పాలయిన హిల్లరీ…ఆ తర్వాత అంతగా ట్రంప్ గురించి మాట్లాడడం లేదు. అయితే ఇటీవల ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్ స్టెయిన్ తమను లైంగికంగా వేధించింనట్టు హాలీవుడ్ హీరోయిన్లు ఆరోపిస్తున్నారు. ఏంజెలినా జోలీ పాటు ఎందరో నటీమణులు హార్వే పై ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిల్లరీ అధ్యక్షుడు ట్రంప్ ను హార్వేతో పోలుస్తూ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు.
అత్యాచారానికి పాల్పడ్డానని ఒప్పుకున్న వ్యక్తినే దేశాధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, ప్రపంచ వ్యాప్తంగా లైంగిక వేధింపుల సమస్య ఉందని హిల్లరీ వ్యాఖ్యానించారు. ఇలాంటి ఘటనలపై దృష్టిసారించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆమె అన్నారు. తనకు, తన భర్తకు హార్వే నాలుగేళ్లగా తెలుసని, అతను నిర్వహించే కార్యక్రమాలకు తాను కూడా వెళుతుండేదాన్నని, కానీ అతనిపై ఇలాంటి ఆరోపణలు రావడం నమ్మలేకపోతున్నానని హిల్లరీ ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తన ఎన్నికల ప్రచారం కోసం హార్వే 16వేల డాలర్లు ఖర్చుచేశాడని, వాటిని ఉమెన్స్ ఛారిటీకి విరాళంగా ఇవ్వాల్సిందిగా కోరాను అని హిల్లరీ చెప్పారు.