అయోధ్య కేసులో రాజీ కుదురుతుందా..?

hindus-and-muslims-compromise-in-between-ayodhya-case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఏళ్ల తరబడి నానుతున్న అయోధ్య వివాదం ఈసారి ఓ కొలిక్కి వచ్చేట్లే కనిపిస్తోంది. సుప్రీంకోర్టుకు సెంట్రల్ షియా వక్ఫ్ బోర్డ్ చేసిన సూచన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాముడి పుట్టాడని చెబుతున్న స్థలంలో ఆలయం నిర్మించి, అక్కడకు కాస్త దూరంగా ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో మసీదు కడితే గొడవ ఉండదని షియా వక్ఫ్ భోర్డు అభిప్రాయపడింది.
ఇప్పటిదాకా అయోధ్యకు పరిష్కారం అంత వీజీ కాదని అందరూ అనుకుంటున్న తరుణంలో.. బాబ్రీ మసీదు ఉన్న స్థలం యజమానిగా ఉన్న షియా వక్ఫ్ బోర్డు ఇలాంటి సూచన చేయడం చిన్న విషయం కాదు. ఇప్పటికే ఈ సూచనపై ముస్లిం సమాజం నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకుటుందనేది ఆసక్తికరంగా మారింది.

సుప్రీంకోర్టుకు 30 అధ్యాయాలున్న అఫిడవిట్ ఫైల్ చేసిన షియా వక్ఫ్ బోర్డు ఎలా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందో వివరంగా చెప్పింది. రెండు ప్రార్థనామందిరాలు ఉన్నా.. లౌడ్ స్పీకర్లు వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అప్పుడే మరోసారి మత ఘర్షణలు రాకుండా ఉంటాయని చెప్పింది. షియా వక్ఫ్ బోర్డ్ సూచనల్ని హిందూ సంస్థలు కూడా అంగీకరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మరిన్ని వార్తలు:

నాకు వార‌సులు లేరు