Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ అనే చిత్రాన్ని చేయబోతున్న విషయం తెల్సిందే. తేజ దర్శకత్వంలో సాయి కొర్రపాటితో కలిసి బాలకృష్ణ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఆగస్టు నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ఇతర ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ కనిపించబోతున్న విషయం తెల్సిందే. అచ్చం ఎన్టీఆర్‌లా బాలయ్య ఉండేలా మేకప్ చేసేందుకు హాలీవుడ్ టీంను రంగంలోకి దించబోతున్నట్లుగా తెలుస్తోంది.
హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ మేకప్ టీం ఇప్పటికే ఎన్టీఆర్‌కు సంబంధించిన పలు ఫొటోలను చూపి, బాలయ్య ఎన్టీఆర్ స్కెచ్‌లు రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వందలాది స్కెచ్‌లు వేయించి బాలయ్య గేటప్పై చాలా శ్రద్ద తీసుకోవాలని నిర్మాత సాయి కొర్రపాటి భావిస్తున్నాడు. పలు చిత్రాల్లో ఎన్టీఆర్ పోషించిన పాత్రలు, గెటప్‌లను పరిగణలోకి తీసుకుని బాలయ్యను ఆ విధంగా మార్చేందుకు మేకప్‌ను సిద్దం చేయబోతున్నారు. ‘ఎన్టీఆర్’ చిత్రంలో బాలకృష్ణ లుక్ కోసం ఇప్పటికే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్‌ను పోలి ఉండేలా దాదాపు 75 శాతం మ్యాచ్ అయ్యేలా బాలయ్య మేకప్ ఉండాలని దర్శకుడు తేజ భావిస్తున్నాడు. అందుకే హాలీవుడ్ రేంజ్ టీంను రప్పించినట్లుగా తెలుస్తోంది.