పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు పోటా పోటీగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అలాంటి వేళ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్థాన్ జాతీయులను వెంటనే వెనక్కి పంపాలని కేంద్ర ప్రభుత్వం మరో కీకల నిర్ణయం తీసుకొంది. దాంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. శుక్రవారం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన స్వయంగా ఫోన్ చేసి.. వారికి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మీ మీ రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్థానీయులను గుర్తించి.. వారిని వెంటనే పాకిస్థాన్ పంపాలని సూచించారు.



