కరోనా వైరస్ దేశంలో చాలా విపరీతంగా వ్యాపిస్తుంది. దీంతో ప్రభుత్వం ఎన్ని గట్టి చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రజలు బయటకు రాకుండా ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటుంది. తెలంగాణాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే వెయ్యికి చేరువలో కేసులు నమోదయ్యాయి. కరోనా ను అరికట్టడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ను సమర్ధవంతంగా అమలు చేస్తున్నా కూడా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.
అయితే తెలంగాణాలో అత్యధికంగా కేసులు జిహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు అవుతున్నాయి. అలాగే.. సూర్యాపేట్ లో కూడా అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులు ఇదివరకు 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని నియమం ఉండగా.. అది కాస్తా ఇప్పుడు 28 రోజులకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.