దివ్యాంగురాలని కూడా చూడకుండా.. ఇంటి యజమాని కూతురి మీద రేప్!

Homeowner's daughter raped ...mentally retarded

అద్దెకు ఇల్లిచ్చిన యజమానురాలి కూతురి మీదే అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. అల్లరి చిల్లరగా తిరిగుతుంటే పెళ్లి చేస్తే బాగుపడతాడనుకున్నారు. మూడేళ్లు కూడా కాపురం చేయలేదు. అతడిలో మార్పు రాలేదు.

మానసిక దివ్యాంగురాలిపై జాలి చూపించాల్సింది పోయి ఒంటరిగా ఉన్న ఆమెపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. తల్లి ఇంట్లోలేని సమయంలో మతిస్థిమితం లేని యువతిని బెదిరించిన ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దారుణమైన ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

హైదరాబాద్ రహమత్‌నగర్‌లో ఓ మహిళ తన కుమార్తెతో కలిసి సొంతింటిలో నివసిస్తోంది. ఆమె కుమార్తెకు మతిస్థిమితం సరిగ్గా ఉండకపోవడంతో కంటికిరెప్పలా కాపాడుకుంటోంది. వీరింట్లోకి ఉమ్మడి వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడకి చెందిన పల్లకొండ వీరస్వామి(38) మూడు నెలల అద్దెకు దిగాడు.

అతడికి భార్య, ముగ్గురు పిల్లలున్నప్పటికీ విబేధాల కారణంగా దూరంగా ఉంటున్నాడు. ఓ పరిశ్రమంలో కార్మికుడిగా పనిచేస్తూ అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంటి యజమానురాలి కుమార్తెపై అతడి కన్ను పడింది.

రాఖీ పౌర్ణమి రోజున ఇంటి యజమానురాలు తన సోదరుడికి రాఖీ కట్టేందుకు కుమార్తెను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన వీరాస్వామి ఇంట్లోకి వెళ్లి మతిస్థిమితం లేని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వెళ్లిపోయాడు.

సాయంత్రం వేళ ఇంటికి వచ్చిన తల్లి కుమార్తె ఏదో ఇబ్బంది పడుతున్నట్లు గమనించి ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో ఆమె స్థానికులతో కలిసి వీరాస్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.