యాదాద్రి పనుల మీద కేసీఆర్ ఫైర్ 

KCR Fire on Yadadri works

ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించేందుకు ఈరోజు యాదాద్రి వెళ్లిన సీఎం కేసీఆర్‌, యాదాద్రి పనుల పురోగతిపై  ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాన ఆలయం పనులు మినహా మిగతా పనులు జరుగుతున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.

స్థానిక హరిత హోటల్‌లో యాడా సిబ్బంది, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పనులు ఎప్పట్లోగా పూర్తి చేస్తారంటూ ప్రశ్నించారు. పనులు పూర్తి చేసేందుకు మరో ఐదేళ్లు కావాలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో ఏమి సమాధానం చెప్పాలో అర్ధం కాని అధికారులు మిన్నకుండిపోయారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి రూ.473 కోట్లతో ప్రతిపాదనలు పంపామని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

దీనిపై సీఎం స్పందిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శితో మాట్లాడి త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. ఆలయ నిర్మాణ పనులకు సంబంధించి తక్షణమే రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.