మైనర్ బాలికకు జిమ్ ట్రైనర్ వేధింపులు…అరదండాలు 

Gym-trainer-harasses-minor-girl

16ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఫిట్‌నెస్ ట్రైనర్‌ను ముంబయి పోలీసులు అరదండాలు పెట్టించారు. బరువు అధికంగా ఉండడంతో అది తగ్గేందుకు 16ఏళ్ల బాలిక మహాలక్ష్మి రీకోర్స్ సెంటర్‌లో జాయిన్ అయింది.

అదే సెంటర్‌లో పర్దేషీ అనే యువకుడు ప్రీలాన్స్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో జిమ్‌కు వచ్చిన బాలిక థ్రెడ్ మిల్‌పై జాగింగ్ చేయసాగింది. అక్కడి వచ్చి బాలికను మాటల్లో దించిన పర్దేషీ బరువు తగ్గించేందుకు కొచ్చి చిట్కాలు చెబుతానంటూ ఆమెపై చేయి వేశాడు.

తాకరాని చోట చేతులు చేస్తూ మర్మావయాలను పట్టుకున్నాడు. దీంతో అతడి ఉద్దేశం గమనించిన బాలిక నీ సలహాలు నాకేంవద్దు అంటూ అతడిని తోసేసింది. దీంతో పర్దేషీ ఆమెపై ఆగ్రహంతో చూడసాగాడు.

ఇంకా అక్కడే ఉంటే అతడి నుంచి ఏదైనా ప్రమాదం జరగొచ్చని భావించిన బాలిక వెంటనే ఇంటికి వెళ్లిపోయి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.  బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు.