అనంతలో అమానుషం…ప్రేమ వలన అరచాకం

Tribal girl beaten by village head

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని కేపీదొడ్డిలో ప్రేమించుకున్నారన్న కారణంతో మైనర్లపై గ్రామపెద్ద అమానుషంగా దాడికి పాల్పడిన ఘటనపై కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే బాలికకు మైనార్టీ తీరకపోవడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోరని భావించి గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు ఇద్దరినీ వెతికి పట్టుకుని తీసుకొచ్చారు. గ్రామంలో పంచాయతీ పెట్టి గ్రామపెద్ద లింగప్ప అందరి ముందూ బాలికతో పాటు యువకుడిని తీవ్రంగా కొట్టారు.

దీనికి సంబంధించి వీడియో వైరల్‌గా మారడంతో ప్రజాసంఘాలు, దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దళితులపై దాడికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో డీఎస్పీ వెంకటరమణ.. తహసీల్దార్‌ వెంకటచలపతి, సీఐ రాజుతో కలిసి బాధిత బాలికను పరామర్శించారు.

ఆమె కుటుంబసభ్యులతో పాటు గ్రామస్థులను విచారించి వివరాలు తెలుసుకున్నారు. రచ్చబండపై కూర్చుని రెచ్చగొట్టేలా వ్యవహరించిన వారిపైనా కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ తెలిపారు. మైనర్ బాలికను ప్రేమించిన యువకుడిపైనా పోక్సో చట్ట కింద కేసు పెట్టారు.