హువావే కంపెనీ హానర్ ప్యాడ్ 5 సిరీస్‌లో రెండు నూతన ట్యాబ్‌లను భారత మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. 8, 10 ఇంచుల డిస్ప్లే సైజ్‌లలో ఈ ట్యాబ్‌లు వినియోగదారులకు లభిస్తున్నాయి. 8 ఇంచుల మోడల్‌కు చెందిన 3జీబీ ర్యామ్ ట్యాబ్ రూ.15,499 ధరకు లభిస్తుండగా, 4 జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.17,499 ధరకు అందుబాటులో ఉంది. అలాగే 10.1 ఇంచుల మోడల్‌కు చెందిన 3జీబీ ర్యామ్ ట్యాబ్ ధర రూ.16,999 ఉండగా, 4జీబీ ర్యామ్ ట్యాబ్ ధర రూ.18,999 గా ఉంది. వీటిని ఫ్లిప్‌కార్ట్ సైట్లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నారు.
హానర్ ప్యాడ్ 5 (8 ఇంచ్ మోడల్) ఫీచర్లు…
8 ఇంచ్ పుల్ హెచ్డీ డిస్ప్లే, 1920 x 1200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హైసిలికాన్, కైరిన్ 710 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్, డాల్బీ అట్మోస్ సపోర్ట్, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ.
హానర్ ప్యాడ్ 5 (10.1 ఇంచ్ మోడల్) ఫీచర్లు…
10.1 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1920 x 1200 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హైసిలికాన్ కైరిన్ 659 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.2, 5100 ఎంఏహెచ్ బ్యాటరీ.