ఉత్తర్‌‌ ప్రదేశ్‌లో ఘొరం

ఉత్తర్‌‌ ప్రదేశ్‌లో ఘొరం

ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు మానవ అస్థిపంజరాలు బయటపడిన ఘటన ఉత్తర్‌‌ ప్రదేశ్‌లో సోమవారం వెలుగుచూసింది. కాన్పూర్ నగరం పంకీ పోలీస్ స్టేషన్ పరిధిలో వీటిని పోలీసులు గుర్తించారు. కశ్మీర్ కాలనీలో ఈ అస్థిపంజరాలు బయటపడ్డాయి. దీంతో ఆ కాలనీలో కలకలం రేగింది. నాలుగు అస్థిపంజరాలు బయటపడటంతో ఆ కాలనీ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నాలుగు అస్థి పంజరాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదుచేసిన దర్యాప్తు ప్రారంభించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కాన్పూర్ జిల్లా ఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు. అనుమానాస్పద కేసుగా నమోదుచేసినట్టు వివరించారు. ఈ నలుగురిని ఎవరైనా హత్యచేశారా? లేదా ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ అస్థిపంజరాలు చాలా రోజులు కిందట చనిపోయిన వ్యక్తులవని, వీరంతా పెద్దవాళ్లేనని పోలీసులు చెప్పారు.

స్వాధీనం చేసుకున్న అస్థిపంజరాలను శవపరీక్షల కోసం తరలించినట్టు తెలిపారు. దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలు వెళ్లడిస్తామని ఎస్పీ అనిల్ కుమార్ అన్నారు. ఆ కాలనీకి చెందిన వ్యక్తులేనా? ఎవరైనా ఇక్కడ పడేశారా? అనేది దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు. దీని వెనుక మిస్టరీ తేల్చడానికి ప్రత్యేకంగా పోలీస్ టీంను ఏర్పాటుచేశారు.