కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు థియేటర్స్, కాలేజీలు, స్కూళ్ళు, మాల్స్, క్లబ్స్, పబ్స్ వంటి వాటిని మార్చి 31 వరకు మూసి వేయాలని ఆదేశించింన ప్రభుత్వం తాజాగా ప్రైవేట్ హాస్టళ్ళను కూడా మూసివేసేందుకు నిర్ణయించింది.
అయితే అమీర్పేట, ఎస్.ఆర్.నగర్లోని హాస్టళ్లను మూసి వేయాలని, సీఎం ఆదేశాల మేరకు హాస్టళ్ల నిర్వాహకులతో పోలీసు అధికారులు, డీసీ గీతారాధిక, కార్పొరేటర్ శేషుకుమారి సమావేశమయ్యారు. ఈ నెల 31 వరకు హాస్టళ్లను మూసివేయాలని నిర్వాహకులకు సూచించారు. బుధవారం సాయంత్రంలోగా హాస్టళ్లు ఖాళీ చేయాల్ని కోరారు. దీనితో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హాస్టళ్ళలో ఉంటున్న వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు అయోమయంలో పడిపోయారు.