ప్రముఖ నిర్మాత డివివి దానయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అద్భుతమైన వార్త తెలిపారు. న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘సరిపోదా శనివారం‘ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా డివివి దానయ్య మాట్లాడుతూ, ‘సరిపోదా శనివారం’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఈ సినిమాతో నాని బాక్సాఫీస్ వద్ద మరో సంచలన విజయాన్ని సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే సందర్భంలో, నాని పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజి’ చిత్రం గురించి ఓ అప్డేట్ ఇవ్వాలని కోరడంతో, దానయ్య ‘ఓజి’ షూటింగ్ త్వరలోనే తిరిగి ప్రారంభమవుతుందని, అలాగే విడుదల కూడా సమీపంలోనే ఉంటుందని వెల్లడించారు.
ఈ వార్త పవన్ కళ్యాణ్ అభిమానులను ఎంతో ఉత్సాహపరచింది. ‘సరిపోదా శనివారం’ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటించగా, ఎస్.జె.సూర్య ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయగా, జేక్స్ బిజాయ్ సంగీతం అందించారు.