ఇంటిలోనే హలీం చేసుకోవడం ఎలా ?

How to make a haleem at home

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రంజాన్ మాసంలో మాత్రామే ప్ర‌త్యేక‌మైన వంట‌కం హ‌లీమ్‌. ప్రత్యేకంగా ముస్లింల కోఅసమే దీనిని తయారు చేస్తున్నా దీన్ని మ‌తాల‌కు అతీతంగా అంద‌రూ తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. నేటి కల్తీ సమాజంలో ఏది నిజమయినదో ఏది కల్తీనో అర్ధం కాని పరిస్థితుల్లో హలీం తినాలని మనసులో ఉన్నా రోగాలు వ‌స్తాయేమోన‌ని భ‌య‌ప‌డుతున్నాం. అందుకే మనకి కావాల్సిన వ‌స్తువులు తెచ్చుకుని ఇంటిలో హ‌లీం చేసుకోవ‌డం ఎలాగో తెలుసుకుందాం..
కావాల్సినవి :
మటన్ : ఒక కేజీ
మసాలా దినుసులు : 100 గ్రా.
గోధుమలు : ఒక కేజీ
పాలు : ఒక లీటరు
నెయ్యి : అర టీస్పూన్
పుదీనా : చిన్న కట్ట,
కొత్తిమీర : చిన్న కట్ట
బ్రౌన్ ఆనియన్ : 1
జీడిపప్పు : 200 గ్రా.
నిమ్మకాయ రసం : 4 టేబుల్‌స్పూన్స్
మిరియాలు : 10 గ్రా.
తయారీ :
ముందుగా మటన్ ఉడికించి పెట్టుకోవాలి. గోధుమ రవ్వ నానబెట్టి ఉంచాలి. ఒక గిన్నె తీసుకొని నెయ్యి వేసి కొంచెం పసుపు వేసి పచ్చిమిరపకాయలు వేసి అందులో రవ్వ మటన్ మసాలా దినుసులు, పాలు, పుదీనా, కొత్తిమీర, కొన్ని బ్రౌన్ ఆనియన్, మిరియాలు వేసి రెండు గంటల పాటు ఉడికించాలి. ఈలోపు బ్రౌన్ ఆనియన్, జీడిపప్పులను వేయించుకోవాలి. వీటిని ఉడికిన మటన్‌లో వేసి దించేయాలి. కాస్త చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం వేసి సర్వ్ చేయాలి. అంతే రుచికరమయిన హోం మేడ్ హలీం తయార్