నేటి కల్తీ కాలంలో అన్నీ గాలి,నీరుతో సహా అన్నీ కల్తీ అవుతున్నాయి. అందుకే అనేక సమస్యలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అందులో పెద్ద సమస్య కిడ్నీలో రాళ్లు ఏర్పడడం. ఈ కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం వలన మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా, మూత్రం వేరే రంగులో రావడం కొన్నిసార్లు మూత్రంతో పాటుగా రక్తం కూడా రావడం జరగవచ్చు. మూత్ర పిండాలలో ఏర్పడిన రాళ్ళు, మూత్ర వచ్చే మార్గానికి అడ్డంకులుగా ఏర్పడి, కిడ్నీలు చేసే పనికి ఆటంకాలను కలుగచేస్తాయి. వాటిని మన ఇంటిలోనే ఉండే ఔషదాల మరియు కొన్ని ఈజీ టెక్నిక్ల ద్వారా తగ్గించుకోవచ్చు.
యూరిక్ ఆసిడ్ స్టోన్స్ కలిగి ఉన్న వారు, సాధారణంగా అధిక మొత్తంలో మాంసాలను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. మాంసాలలో ఉండే ప్రోటీన్ ల వలన శరీరంలో కాల్షియం స్థాయిలు పెరుగి కిడ్నీలలో రాళ్ళ అధికం ఏర్పడతాయి. అందుకే ఆల్రెడీ కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు అధిక ప్రోటీన్ గల ఆహార పదార్థాలను అంటే చేప, వైన్ మరియు మీట్ వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే రోజులో 3000 మిల్లి గ్రాముల కన్నా అధిక మొత్తంలో విటమిన్ ‘C’ తీసుకునే వారిలో మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయని అని డాక్టర్లు చెబుతున్నారు. మన శరీరంలో విటమిన్ ‘C’ ‘ఆక్సలేట్’ గా మార్చబడుతుంది, ఫలితంగా మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడే అవకాశం కూడా అధికమవుతుందన్న మాట. కావున, తీసుకునే ఆహారంలో విటమిన్ ‘C’ సేకరణ స్థాయిలు ఎంత మేరకు ఉన్నాయో చూసుకోవాలి. కానీ, శరీరానికి కావలసిన ముఖ్య పోషకాలలో విటమిన్ ‘C’ కూడా ఒకటి. కావున అధిక మొత్తంలో కాకుండా, శరీరానికి తగిన స్థాయిలో మాత్రమే తీసుకోవటం మన వంటికీ కిడ్నీలకి మంచింది.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి, విటమిన్ ‘A’ అవసరమయిన పోషకంగా చెప్పవచ్చు. మూత్రపిండ సంబంధిత ఇన్ఫెక్షన్ లను తగ్గించి, మూత్రపిండాలలో రాళ్ళ ఏర్పాటును నివారిస్తుంది. క్యారెట్, చిలకడదుంప వంటి వాటిలో విటమిన్ ‘A’ పుష్కలంగా ఉంటుంది. అధిక మొత్తంలో విటమిన్ ‘A’ కూడా విషపూరితం అని చెప్పవచ్చు. కావున అవసరమైన స్థాయిలో మాత్రమే ఈ విటమిన్ ను తీసుకోవాలి. కిడ్నీలో ఏర్పడే రాళ్ళను తగ్గించే శక్తివంతమైన ఔషదంగా ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మరసం కలగలుపు మిశ్రమాన్ని తెలుపవచ్చు. సమాన మొత్తాలలో ఆలివ్ ఆయిల్ మరియు నిమ్మరసంలను కలిపి, తాగండి.
ఈ మిశ్రమం తాగిన వెంటనే ఒక గ్లాసు నీటిని తాగండి. మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్ళ వలన కలిగే నొప్పిని తగ్గించటమే కాకుండా, వీటి ఏర్పాటు ప్రక్రియను కూడా ఈ మిశ్రమం నివారిస్తుంది. ఇవి కాక మరికొన్ని చిట్కాలు చూస్తే రోజు ఉదయాన చిటికెడు ఉప్పు వేసిన టమోటా రసాన్ని తాగండి. అలాగే ఒక కప్పు ముల్లంగి ఆకుల నుండి సేకరించిన రసాన్ని తాగండి. ఈ రసాన్ని రోజు రెండు సార్లు తాగటం వలన త్వరగానే రాళ్ళూ కరుగుతాయి. అలాగే ఒక అరడజను పచ్చి బెండకాయలను తీసుకొని, పొడవైన ముక్కలుగా కత్తిరించి, రెండు లీటర్ల నీటిలో పూర్తి రాత్రి వరకు నానబెట్టండి. తరువాత ఉదయాన బెండకాయలను నీటి నుండి తీసి, వాటిని పిండి, వచ్చే రసాన్ని అదే రెండు లీటర్ల నీటిలో కలపండి. ఇలా బెండకాయ రసం కలిగిన రెండు లీటర్ల నీటిని రెండు గంటలలో తాగండి. దీనివల్ల కూడా కిడ్నీలో రాళ్ళూ కరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.