ఈ టెక్నిక్స్ తెలిస్తే పొట్టివారు ఫీల్ అవాల్సిన పనే లేదు !

చాలా మంది తాము పొట్టిగా ఉన్నామనే భావనలో ఆత్మన్యూనతా భావంలో బతికేస్తూ ఉంటారు, కానీ నిజానికి పొట్టి పొడుగు అనేది అసలు సమస్యే కాదు, ఎందుకు అంటే పొట్టి వారిలో అనేక విజయాలు సాధించినవారున్నారు. నిజంగా అదొక సమస్య అయితే వారంతా విజయ బాటలో నడిచి ఉండేవారు కాదు. అయినా ఏమీ పర్లేదు తాము కొంచెం పొట్టిగా ఉన్నామనుకునే వారూ కొన్ని చిన్న చిన్న ఫ్యాషన్ మరియు డ్రెస్సింగ్ టిప్స్ మిమ్మల్ని మరింత అందంగా కనిపించేలా చేయడమే కాకుండా, మీరు ఏదైతే పొట్టిగా ఉన్న దానిని లోపంగా భావిస్తున్నారో దానిని పూర్తిగా లేకుండా చేస్తుంది. కొంచెం పోడవుగా లేని వాళ్ళు పొడుగుగా కనిపించడానికి ఈ విధమైన పద్దతులు అనుసరిస్తే మీరు ఆకర్షణీయంగా మీ పొడవుతో సంభందం లేకుండా కనపడతారు. దారణంగా మన హైట్ మన పూర్వీకుల జీన్స్ ద్వార నిర్దారించడం జరుగుతుంది. దీంట్లో మనం చేసేది ఏమి లేదు. అయిత కొన్ని చిన్న చిన్న చిట్కాలతో పొడుగుగా కనిపించడం కష్టం ఏమి కాదు.

నిటారుగా నిలబడం, లేదా కూర్చోవడం వలన పొడుగుగా కనిపించవచ్చు. ప్రత్యేకంగా, వంగడం వలన ఇంకా పొట్టిగా కనపడకుండా ఉండచ్చు. కొన్ని దుస్తులతో కూడా మనం పొడుగుగా కనపడడానికి అవకాశాలున్నాయి. ముఖ్యంగా, గళ్ళ డిజైన్లు మరియు చెక్స్ ఉన్న దుస్తులు ఉన్నదానికంటే పొట్టిగా కనపడేలా చేస్తాయి. అలాగే, ఒకటే రంగు డ్రెస్ వేసుకోవడం వలన పొడుగుగా కనపడవచ్చు. జీన్స్ కాని మరి ఇతరత్రా వేరే ఏదైనా పాంట్స్ కానీ వేసుకుంటే , దాని చివరలు ఓపెన్ గా ఉండడం కాకుండా, టైట్ గా  ఉండేలా చుడండి, ఇంకా ఈ పాంట్లు చీల మండలపై వరకు ఉంటే ఇంకా పొడువుగా కనపడవచ్చు. అడ్డ డిజైన్లు కాకుండా, నిలువుగా ఉండే డిజైన్లు కూడా పొడువుగా ఉన్నట్టు కనపడవచ్చు. బిగుతుగా ఒంటికి అంటుకుని ఉండే దుస్తులు వేసుకుంటే వదులుగా ఉండే దుస్తులు వేసుకున్నప్పటి కంటే హైట్ ఉన్నట్టు కనపడేలా చేస్తాయి. అలాగే బిగుతు దుస్తులు పొడువుగా కనపడేలా చేస్తాయి. ఇదండీ సంగతి ఇకనుండి పొట్టిగా ఉన్నామని భావించే వారు ఈ పద్దతులు ఫాలో అయితే సరి.