అలాగే మీ చర్మం పై ముడుతలు పడకుండా ముందు నుండి కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని కూడా తెలుస్తాయి. ఎక్కువగా ముఖం మీద గీతలు రావడం, రంగు మారిపోవడం లేదంటే ముడతలు పడడం ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒత్తిడి, వయసు పైబడటం, పొల్యూషన్, సరైన పోషక పదార్థాలు లేక పోవడం, బ్లూ లైట్ మొదలైన కారణాల వల్ల ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే ఇక్కడ చాలా అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి వీటిని కనుక ఫాలో అయితే ఖచ్చితంగా చర్మం మరింత అందంగా ఉంటుంది. అలాగే చర్మ సమస్యలు కి కూడా దూరంగా ఉండొచ్చు. డాక్టర్ అమిత్ డెర్మటాలజిస్ట్ మనతో చాలా ముఖ్యమైన టిప్స్ ని చేసుకున్నారు మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వాటి కోసం చూసేద్దాం.ఇక్కడ వయసును బట్టి ఎలాంటి టిప్స్ ని అనుసరించాలి అనేది వైద్యులు చెబుతున్నారు. అయితే దీనిని చూస్తే 20 ఏళ్ళ వయసులో ఉండే వాళ్ళు ఎలాంటి టిప్స్ ని పాటిస్తే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది చర్మ సమస్యలు లేకుండా ఎలా ఉండొచ్చు అనేది తెలుస్తుంది.
అయితే ఎక్కువగా డెడ్ స్కిన్, బ్రేక్ అవుట్స్, బ్లాక్ హెడ్స్, యాక్ని లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా హార్మోనల్ మార్పులు వలన వస్తూ ఉంటాయి అయితే ఆరోగ్యకరమైన జీవన విధానం, మంచి పోషక పదార్థాలు, సరైన నిద్ర ఉంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు.రాత్రి నిద్ర పోయేటప్పుడు అసలు మేకప్ తో నిద్ర పోకండి. మేకప్ వేసుకుని ఉంటే కనుక దాన్ని తొలగించి అప్పుడే నిద్రపొండి అని డాక్టర్ అంటున్నారు.అలానే మాయిశ్చరైజింగ్ చేయడం చాలా ముఖ్యం. చర్మానికి ఎప్పుడూ కూడా మాయిశ్చరైజింగ్ చేయాలి. ఒకవేళ మీకు ఆయిల్ స్కిన్ ఉన్నా సరే మీరు మాయిశ్చరైజర్‌ని ఉపయోగించాలి.
అలానే సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం కూడా చాలా ముఖ్యం. సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం వల్ల స్కిన్ క్యాన్సర్ రాదు. అలానే చర్మం పై దురదలు వంటి సమస్యలు కూడా రావు.ఎప్పుడైనా చర్మం పై సమస్యలు వస్తే వాటిని అసలు మీరు పట్టించుకోకుండా వదిలేయకండి. తప్పక శ్రద్ధ తీసుకోవాలి. వీలైతే డెర్మటాలజిస్ట్ ని కూడా కన్సల్ట్ చేయండి ఇలా ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే 20 ఏళ్లలో ఉండేవాళ్ళు అద్భుతంగా ఉంటారు. అలానే ఎటువంటి సమస్యలు లేకుండా ఉండొచ్చు.ఇక 30 ఏళ్ల వయసు వాళ్ళు ఎలాంటి చిట్కాలను పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు, తీసుకోవాలి ఏ విధంగా అనుసరిస్తే చర్మం బాగుంటుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
30 ఏళ్ళ వయసు వాళ్ల గురించి చూస్తే.. 30 ఏళ్ల వయసు లో వాళ్ళు సరైన పోషక పదార్థాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ వయసులో మీకు మెటబాలిజం తగ్గిపోతూ ఉంటుంది.ఇటువంటి సమయంలో మంచి పోషక పదార్థాలు అందేటట్టు చూసుకోవాలి.అలాగే చర్మ సమస్యలు ఏమీ లేకుండా కూడా చూసుకోవడం చాలా ముఖ్యం.ఈ వయసులో ఎక్కువగా ఇంఫ్లమేషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి తగినంత శ్రద్ధ తీసుకోవడం.
అవసరమైతే డెర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ చేయడం లాంటివి చేయండి.ఇలా 30 ఏళ్ళ వయసులో ఉండే వాళ్ళు ఈ విధంగా అనుసరిస్తే తప్పకుండా ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉండొచ్చు. అలాగే చర్మ సమస్యలు కూడా ఉండవు.
అదే 40 ఏళ్ల వయసు వాళ్ళు ఏం చేయాలి అనేది చూస్తే… ఈ వయసులో హైడ్రేట్ అవుతుంటారు. అలాగే చర్మం సాగిపోవడం, ముడతలు పడడం ఇలాంటి జరుగుతాయి. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం ఏమిటంటే వయసు పైబడటం.అయితే ఈ వయస్సు వారు అనారోగ్య సమస్యలు ఏమి లేకుండా ఉండేలా చూసుకోవాలి.మీ యొక్క బరువుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మీ బరువు కనుక ఎక్కువగా ఉంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి మంచిగా బరువును మెయింటైన్ చేయండి. ఎక్కువ బాడీ వెయిట్ ఉంటే డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఒబేసిటీ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన బరువు ఉండాలి.
అలానే మంచి పాజిటివ్ మైండ్ సెట్ లో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మెనోపాజ్ సమయం కాబట్టి.అదే విధంగా స్కిన్ కేర్ ఎక్స్పర్ట్ ని కన్సల్ట్ చేస్తే మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగించుకో వచ్చు.ఇలా ఈ విధంగా 40 ఏళ్ల వయసు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే సమస్యలేమీ లేకుండా ఉండొచ్చు.చూశారు కదా ఏ వయసు వాళ్ళు ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి అనేది మరి ఆ విధంగా అనుసరించి ఎలాంటి చర్మ సమస్యలు లేకుండా ఆనందంగా ఉంది అలానే ఈ టిప్స్ తో ఎప్పుడూ కంటే కూడా మరింత ఆనందంగా ఉండొచ్చు.