మన దేశంలోకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అతి తక్కువ మంది హీరోల్లో హృతిక్ కూడా ఒకరు.తనదైన మస్కులర్ బాడీ మరియు నటనలతో హృతిక్ కోట్లాది మంది అమ్మాయిలకు కలల రాకుమారుడిగా ఇప్పటికీ కొనసాగుతున్నాడు.కానీ అలాంటి ఎందరో అమ్మాయిల్లో ఓ అమ్మాయి హత్యకు ఇప్పుడు హృతిక్ కారణం అయ్యాడు.
అసలు వివరాల్లోకి వెళ్లినట్టయితే అమెరికా న్యూయార్క్ కు చెందిన డోనె డోజెయ్ హృతిక్ కు వీరాభిమాని ఎంత వీరాభిమాని అంటే ఆమె రాత్రి వేళల్లో కూడా హృతిక్ పేరునే తలచుకుంటుందంట.ఇదే ఇప్పుడు ఆమె కొంప ముంచింది.అక్కడ ప్రాంతానికి చెందిన దినేశ్వర్ బుదిహాట్ తో ఏర్పడిన పరిచయం ప్రేమ వివాహానికి దారి తీసింది.కానీ అప్పటికీ ఆమె హృతిక్ మీదున్న అభిమానాన్ని చంపుకోలేకపోయింది.
అది మరింత పెరిగి తన భర్తను కూడా హృతిక్ లా ఉండాలని అతనితో తరచూ పోల్చి చూస్తుండేది.దీనితో విసుగు చెందిన దినేశ్వర్ ఆమెను సరి చెయ్యాలని చాలా సార్లు ప్రయత్నించేవాడు అయినా సరే ఆమె వినకపోవడంతో టార్చర్ చేసే సరికి అతనిపై ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.ఇక అంతే అతన్ని నాలుగు రోజులో కస్టడీలోకి తీసుకున్నారు.దీనితో ఆమెపై విపరీతమైన కక్ష పెంచుకున్న దినేశ్వర్ ఆమెను కలిసి కత్తితో దాడి చేసి హత్య చేసి చంపేశాడు.ఆ తర్వాత తాను కూడా ఆత్మ హత్య చేసుకొని చనిపోయాడు.మొత్తానికి ఒక అభిమాన హీరోపై ఉన్న అమితమైన అభిమానం ఇంత ఘాతుకానికి దారి తీసింది.