కరోనా వాక్సిన్ ఉచిత సరఫరా ‌ కోసం రూ. 35 వేల కోట్లు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. జనజీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ నేడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ‘నెవర్‌ బిఫోర్‌’ బడ్జెట్‌ను ప్రకటించనున్నట్లు నిర్మల ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో.. కరోనాతో కుదేలైన వ్యవస్థలన్నీ 2021-22 బడ్జెట్‌పై భారీ స్థాయిలో ఆశలు పెట్టుకోవడం జరిగింది . ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం కొగసాగుతోంది….

When Nirmala Sitharaman pulled out the Modi playbook | Deccan Herald

బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌..

* రక్షిత మంచినీటి పథకాల కోసం రూ.87వేల కోట్లు
2కోట్ల 18 లక్షల ఇళ్లకు రక్షిత మంచినీరు
జల జీవన్‌ మిషన్‌కు రూ.2,87,000 కోట్లు కేటాయింపు.

* కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కోసం 35వేల,400 కోట్లు.

* మెగా ఇన్వెస్ట్‌మెంట్‌ టెక్స్‌టైల్‌ పార్క్‌

* కొత్తగా బీఎస్‌ఎల్‌-3 ప్రయోగశాలలు 9 ఏర్పాటు.

* వాహన పొల్యూషన్‌ను తగ్గించడంపై ప్రత్యేక దృష్టి
పర్యావరణ హితంగా వాహనాలు ఉండాలన్నది లక్ష్యం
వ్యక్తిగత వాహనాలు 25 ఏళ్లు, కమర్షియల్‌ వాహనాలు 15 ఏళ్లుగా నిర్ధారణ

* 64,150 కోట్లతో ఆత్మనిర్భర భారత్‌ : రైతుల ఆదాయం రెట్టింపులక్ష్యం
6 సంవత్సరాలకు గాను 64వేల 180కోట్లరూపాయలతో ఆత్మనిర్భర్‌ యోజన పేరుతో కొత్త పథకం

* నేషనల్‌ డిసిజ్‌ కంట్రోల్‌ సిస్టం మరింత పటిష్టం ,దేశ వ్యాప్తంగా 15 ఎమర్జెన్సీ సెంటర్లు

* ఆరోగ్య రంగానికి పెద్దపీట

Finance Minister Nirmala Sitharaman to Meet PSU Bank Chiefs on Monday; to Review Credit Flow
100 దేశాలకు మనం కరోనా టీకాలను సరఫరా చేస్తున్నాం.
కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బడ్జెట్‌లో పొందుపరిచాం
ప్రధాని మోదీ హయాంలో 9వ బడ్జెట్‌, బడ్జెట్‌ యాప్‌ రిలీజ్‌ చేసిన కేంద్రం
అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం.
లాక్‌డౌన్‌ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యంఇచ్చాం.

* టీమిండియా అద్భుత విజయాన్ని ప్రస్తావన
లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్‌. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని ఆమె ప్రారంభించారు.

*కేంద్ర బడ్జెట్ యూనియన్‌ బడ్జెట్ పేరుతో ప్లేస్టోర్‌లో అప్లికేషన్ ఆన్‌లైన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంది. పాపార్లమెంట్‌ భవనంలో కేంద్ర కేబినెట్ బడ్జెట్‌ను ఆమోదించింది. మరికొద్ది క్షణాల్లో ఆర్థికమంత్రి బడ్జెట్‌ను సభ ముందుంచునున్నారు.

* మంత్రులు నిర్మాలా సీతారామన్‌, అనురాగ్‌ ఠాగూర్‌ సోమవారం ఉదయం ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరి రాష్ట్రపతి కార్యాలయంలో ప్రెసిడెంట్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. రాష్ట్రపతికి బడ్జెట్‌ ప్రతిని అందజేశారు. అనంతరం పార్లమెంట్‌కు బయలుదేరి వెళ్లారు. కేబినెట్‌ భేటీలో బడ్జెట్‌కు ఆమోదం అనంతరం లోక్‌సభలో ప్రవేశపెడతారు.

* చరిత్రలో తొలిసారి పేపర్‌ లెస్‌ బడ్జెట్‌ను ప్రవేశట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, మేడ్‌ఇన్‌ ఇండియా ట్యాబ్‌లో బడ్జెట్‌ను భద్రపరచినట్టు వెల్లడించారు. ట్యాబ్‌లో చూసి ఆమె బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

* మేడ్‌ఇన్‌ ఇండియా బహీ ఖాతా ఎర్ర రంగు ట్యాబ్‌తో నిర్మలా సీతారామన్‌, అనురాగ్‌ఠాకూర్‌, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పార్లమెంటుకు చేరున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు హర్షవర్ధన్‌, అమిత్‌ షా కూడా పార్లమెంట్‌కు హాజరయ్యారు.