ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్ కార్నివాల్ సేల్‌లో ఐఫోన్ 12 స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపును అందించారు. సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఈ సేల్ జరగనుంది. ఐఫోన్ 12లో ఓఎల్ఈడీ డిస్ప్లేను అందించారు. ఇందులో కూడా 5జీ సపోర్ట్‌ను కంపెనీ అందించింది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి.ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్‌ను ఈ సేల్‌లో రూ.66,999కే కొనుగోలు చేయవచ్చు.
ఈ ఫోన్ అసలు ధర రూ.79,900 కాగా ఇప్పుడు ఈ ఫోన్ రూ.12,901 వేల తగ్గింపుతో లభించనుందన్న మాట. గతంలో జరిగిన సేల్‌లో ఈ ఫోన్‌పై రూ.9 వేల డిస్కౌంట్‌ను అందించగా, ఇప్పుడు ఏకంగా రూ.13 వేల వరకు తగ్గింపును అందించారు.ఇందులో 6.1 అంగుళాల డిస్ ప్లేను యాపిల్ అందించింది. ఏ14 బయోనిక్ చిప్పైనే ఈ ఫోన్ కూడా పనిచేయనుంది.
5జీ సపోర్ట్ కూడా ఇందులో కంపెనీ అందించనుంది. 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలోనే ఈ ఫోన్ కూడా కొనుగోలు చేయవచ్చు. 17 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను ఈ ఫోన్ అందిస్తుంది. దీని మందం కేవలం 0.74 సెంటీమీటర్లు మాత్రమే ఉండగా, బరువు 164 గ్రాములుగా ఉంది.ఐవోఎస్ 14 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో కూడా వెనకవైపు 12 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాలనే అందించారు. సెల్ఫీ కెమెరా సామర్థ్యం కూడా 12 మెగా పిక్సెల్ గానే ఉంది. ఈ ఫోన్‌తో పాటు చార్జర్ రాదు. కేవలం లైటెనింగ్ కేబుల్ మాత్రమే రానుంది. అడాప్టర్ కావాలంటే ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ కూడా ఈ నెలలోనే జరగనుంది కాబట్టి ఐఫోన్ 12 సిరీస్ ధరలు త్వరలో మరింత తగ్గే అవకాశం ఉంది.