రష్యా మాస్కోలోని ఈశాన్య ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. బుధవారం రోజున జరిగిన ఈ పేలుడు ఘటనలో చాలా మంది గాయపడగా, వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు స్థానిక అధికారులు చెప్పారు తీవ్రంగా గాయపడి మరో 56 మంది చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. జాగ్రోస్క్ ఆప్టికల్ ప్లాంట్లో పేలుడు ధాటికి పాక్షికంగా 38 అపార్ట్మెంట్లు దెబ్బతిన్నట్లు ఆ ప్రాంత గవర్నర్ వివరించారు. చట్టుపక్కల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నారు.
శిథిలాల కింద కొందరు చిక్కుకొని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. పేలుడుకు కారణాలను అధికారులు వెల్లడించలేదు. బుధవారం నాటి ఘటనకు ముందు మాస్కోపై దూసుకొచ్చిన రెండు ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేశామని రష్యా ప్రకటించింది. దీన్ని ఉగ్రచర్యగా అభివర్ణించింది. కర్మాగారంలో పేలుడుకు, డ్రోన్ల దాడికి సంబంధం ఉందని కొన్ని రష్యా పత్రికలు పేర్కొనడం గమనార్హం