తమిళనాడు గజ గజ

తమిళనాడు గజ గజ

తమిళనాడు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణాల వల్ల తమిళనాడు తీవ్రంగా దెబ్బతింది. ఆరు జిల్లాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తిరునవెల్లీ, ట్యూటికోరిన్‌, తేని, విరుదానగర్‌, వెల్లోర్‌, రామనాథ్‌పురం, మధురై జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తూ ప్రజలకు అధికారులు వర్షాల కారణంగా పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి చెట్ల కింద, విద్యుత్ స్తంభాల పక్కన నిల్చోవద్దని తెలియ చేశారు. లక్షల ఎకరాల్లో పంట నీట మునుగుతూ భయంకర గాలులు ధాటికి పలు ప్రాంతాల్లో వందలాది ఇళ్లు కోల్పోతున్నాయి. .