పెండింగ్‌ చలాన్లు తప్పించుకుని తిరుగుతున్న ఇన్నోవా

పెండింగ్‌ చలాన్లు తప్పించుకుని తిరుగుతున్న ఇన్నోవా

కుషాయి గూడ ట్రాఫిక్‌ ఎస్‌ఐ ప్రభాకర్‌ రెడ్డి ఈసీఐఎల్‌ చౌరస్తాలో మంగళవారం ఉదయం విధులు నిర్వ హిస్తుండగా రోడ్డు పక్కన పార్క్ చేసిన ఇన్నోవా వాహనం నంబర్‌ను ట్యాబ్‌లో చెక్‌ చేశారు. టీఎస్‌ 07 ఈబీ 1115 నంబర్‌ గల ఇన్నోవా వాహనం పెండింగ్‌ చలాన్లు 76,425 రూపాయలు ఉంది. చలాన్లు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్న వాహనం చిక్కగా డ్రైవర్‌ను పిలిచి చలాన్ల గురించి చెప్పారు.

డ్రైవర్‌ యజమానికి  విషయం తెలియ జేయగా వాహన యజమాని శ్రీనివాస్ వెంటనే ఈసీఐఎల్‌ చౌరస్తాకు చేరుకున్నాడు. ఏడాది నుంచి చలాన్లు పెండింగ్‌లో ఉండగా ఎక్కువ చలాన్లు ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వేగంగా వెళ్లడం వల్ల స్పీడ్‌గన్స్‌ తో రికార్డు అయినవి ఉన్నాయి