వర్మ సినిమా టైటిల్ పై ఫిర్యాదు

వర్మ సినిమా టైటిల్ పై ఫిర్యాదు

కమ్మరాజ్యంలో కడప రెడ్లు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ నిర్మాణ సారథ్యంలో రానున్నది. దీపావళి సందర్బంగా రిలీస్ అయిన సినిమాకి సంబందించిన ట్రైలర్ అనేక వివాదలకి దారి తీస్తుంది. టైటిల్‌ను నిషేధించాలని కోరుతూ పలువురు రాజకీయ నాయకులు అనంతపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అనంతపురం  జిల్లా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగరాజు పలువురు నాయకులతో కలిసి వచ్చి సినిమా టైటిల్‌ రద్దు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు .సినిమా టైటిల్‌ కులాల మధ్య గొడవలు సృస్టించే విధంగా ఉందని, టైటిల్‌ రద్దు చేయాలని డిమాండు చేశారు. ఇలా సినిమా టైటిల్‌ పెట్టడం సరికాదని ప్రేక్షకులకు వినోదం కల్పించేలా ఉండాలి కానీ ఇలా టైటిల్స్‌ తో రాజకీయంగా కులాల మధ్య మనస్పర్థలు, గొడవలు సృష్టించే టైటల్స్ పెట్టరాదని, ప్రజలకు మంచి సందేశం అందించే విధంగా సినిమాలు చెప్పారు.

అటు అమరావతిలో కూడా ఈ సినిమాపై బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు రమేష్‌ నాయుడు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని రీజినల్‌ సెన్సార్‌ బోర్డుకు విద్వేషాలు నింపేలా సినిమా టైటిల్‌ ఉందని కంప్లైంట్ ఇచ్చారు. సంచలనాలు, ఆదాయం కోసం ఇలాంటి టైటిళ్లు పెడుతున్నారని ఇంకా సినిమా విడుదలకు అనుమతి కథను పరిశీలించాకే ఇవ్వాలని కోరారు. టైటిల్ కూడా మార్చాలని కోరారు.