తమిళనాడులో హై అలర్ట్

తమిళనాడులో హై అలర్ట్

రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న భారీ వర్షాలతో తమిళనాడు నీట మునిగింది. రాష్ట్రమంతటా భారీ వర్షాలతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురైయ్యారు.

ఊళ్లు సైతం వరదల్లో చిక్కుకుపోయాయి. నైరుతి ఋతు పవనాలు వెనక్కు తగ్గాయి అని వాతవరణ శాఖ చెప్పింది. వాతవరణ శాఖ సమాచారంతో ఊపిరి పీల్చుకున్న తమిళ ప్రజలు ఇపుడు వర్షాల వల్ల తీవ్ర ఇబ్బంది ఎదుర్కుంటున్నారు. వాగులు జలపాతాలు పొంగి పొర్లుతు భారీగా కురుస్తున్న వర్షాలవల్ల పంట నష్టం భారీగా కలిగింది.

భారీగా వర్షాల వల్ల చెన్నై, తిరువళ్లూరు, కోయంబత్తూరు, కాంచీపురం జిల్లాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం వల్ల రవాణా కి ఇబ్బంది గా మారింది. మూడు రోజుల పాటు ఊటీకి పర్యాటక రైళ్లు రద్దు చేశారు. వర్షాలు ఇంకా రెండు రోజులు ఉండటంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలు చేపడుతూ సెలవులు ఇచ్చింది.