ఆసియా ఖండంలోనే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ ఆర్థిక వృద్ధిని పెంపొందించే చర్యల్లో భాగంగా రానున్న ఐదేళ్లలో విమాయన రంగంలో ప్రభుత్వం లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దేశ వ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు 2024 నాటికి ప్రారంభం అవనున్నాయి. కొత్తగా 1000రూట్లను చిన్న పట్టణాలు, పల్లెలను అనుసంధానించాలని కేంద్రం సన్నాహాలు ఏర్పాటు చేస్తుంది.
దేశ ఆర్థిక వృద్ధి తగ్గిపోవడం వల్ల నరేంద్ర మోడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్ధిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. 2025 నాటికల్లా భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా కంటే విమానాశ్రయాల అభివృద్ధిలో భారత్ వెనకపడి ఉన్నది. 600 మంది పైలట్లతో దేశీయ విమానాలు నడిపేలా కేంద్రం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
మూడేళ్ల క్రితం 450ర న్వేలు ఉండగా ప్రస్తుతం ఇపుడు 75 రన్వేలు మాత్రమే పని చేస్తున్నాయి. చిన్నపట్టణాలకు విమానాలు నడపకపోవడం వల్ల మిగతా రన్వేలపై విమానాలను నడిపేందుకు విమానాయాన సంస్థలు ఏర్పాటు జరుపుతున్నాయి. వీటి కోసం కేంద్రం 38 విమానాశ్రయాలను అభివృద్ధి చేసి టికెట్ ధరలు కూడా తగ్గించే ప్రయత్నాలు చేస్తుంది.