భార్యకి తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని ఆగ్రహం చెందిన భర్త దారుణానికి పాల్పడ్డాడు. ఆమెతోనే ఫోన్ చేయించి నమ్మకంగా రప్పించి కత్తితో పొడిచేశాడు. ఈ దారుణ ఘటన విజయవాడలో జరిగింది. కృష్ణలంక ప్రాంతానికి చెందిన వివాహిత మహిళకు పిచ్చయ్య అనే వ్యక్తి తరచూ ఫోన్ చేసి వేధింపులకు పాల్పడుతున్నాడు.
అసభ్య పదజాలంతో నీచంగా మాట్లాడుతుండడంతో ఆమె భర్తకి చెప్పింది. ఆగ్రహంతో రగిలిపోయిన భర్త ఆమెతోనే పిచ్చయ్యకి ఫోన్ చేసి పటమటలోని స్టెల్లా కాలేజీ వద్దకు నమ్మకంగా పిలిపించాడు. పిచ్చయ్య రాగానే కత్తితో పొడిచేశాడు. తీవ్రగాయాలపాలైన పిచ్చయ్యని ఈఎస్ఐ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.