మహారాష్ట్రలోని పూణెలో ఘోరం జరిగింది. గేదెకు గడ్డి కోసం పొలం వెళ్లిన మహిళ ఎంతసేపటికి తిరిగిరాక పోవడం పైగా.. ఆమె గర్భిణి కావడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా వెతుకులాడారు. అయిచే అక్కడే తోటలో చెరుకు మొక్కల మధ్య శవంగా పడి ఉండటం చూసిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఆమె బట్టలు చిందరవందరగా పడటం చూసి అనుమానం వచ్చింది. ఆమెపై అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేసి ఉంటారని భావించారు. మహిళ మృతదేహం పడి ఉన్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకొని ఇది ఉందన్న సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది హత్యాచారంగానే రికార్డ్ చేసుకున్నారు.
అయితే అక్కడే పొలంలో దొరికిన ఒక్క చిన్న క్లూ పోలీసులకు ఆయుధంగా ఉపయోగపడింది. గర్భిణి హత్య కేసును ఛేదించేలా చేసింది. హంతకుడు అంతా పక్కా ప్లాన్ ప్రకారమే చేశాడన్న భావంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఆ పక్కనే పొలంలో ఓ చిన్న పేపర్ ముక్క పడి ఉండటం చూసి అది తీసుకొని క్షణ్ణంగా పరిశీలించారు. అతడి హ్యాండ్రైటింగ్ ఆధారంగా హంతకుడెవరో పసిగట్టి షాక్‌కి గురయ్యారు. గర్భంతో ఉందని కూడా ఏమాత్రం కనికరం లేకుండా భర్తే ఓ ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు స్పష్టం చేశారు. ఈ దారుణ ఘటన పూణె పరిధిలోని నారాయణగావ్ పోలీస్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. కాగా భార్యపై అనుమానంతోనే భర్త ఇలాంటి హత్యకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది.