చనిపోయిన శవం పక్కన కొద్దిసేపు ఉండడానికే భయపడతారు చాలా మంది. కానీ చనిపోయిన వ్యక్తి శవం పక్కన వారం రోజుల పాటు ఉండాల్సి వస్తే ? ఆ ఊహే భయంకరంగా ఉంది కదూ…కానీ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ ఘటన కర్నాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. గుండెపోటుతో మృతి చెందిన భార్య శవాన్ని పెట్టుకుని వారం రోజుల పాటు అలాగే ఉండాల్సి వచ్చింది ఓ భర్తకు. వివరాల లోకి వెళితే కారవారలోని కేహెచ్‌బీ కాలనీలో రాంబాబు – గిరిజ దంపతులు ఉండేవారు.
రాంబాబు కొన్నాళ్ళ క్రితం పెరాలసిస్‌తో మంచాన పడ్డాడు. అప్పటి నుండి గిరిజనే ఆయనకు సపర్యలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆయనకు భార్యే సపర్యలు చేసేది. అయితే వారం రోజుల క్రితం గిరిజ గుండెపోటుతో మృతి చెందింది. పెరాలసిస్‌తో కదలేని స్థితిలో ఉన్న మోహన్ పక్కనే ఆమె మృతి చెందినా ఆయన ఏమీ చేయలేని స్థితిలో వారం రోజుల పాటు భార్య శవం పక్కనే ఉన్నాడు. అయితే ఇళ్లలో పాచి పనులు చేసే గిరిజ కొద్ది రోజులుగా రాకపోవడంతో ఆదివారం కొందరు వెతుక్కుంటూ ఆమె ఇంటికి వచ్చి చూడగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే శవం కుళ్లిన స్థితికి చేరింది. ఆనంద్ కూడా కొన ఊపిరితో ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తదుపరి చర్యలు చేపట్టారు.