కరోనా వైరస్.. దాంతో లాక్ డౌన్ ప్రజానీకం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న వేళ. కొందరు తమకు అనుకూలంగా మలుచుకొని చాన్నాళ్ల నుంచి ఉన్న కోరికలను తీర్చుకొనేందుకు తప్పుడు కార్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా కోల్కత్తాలో దారుణం చోటు చేసుకుంది. జల్సాలకు బానిసలైన దుర్మార్గులు తీసుకున్న అప్పు సకాలంలో తీర్చలేక తమ భార్యలని ఓ వ్యక్తికి తాకట్టు పెట్టేశారు. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన వారికి జీవితం నరకంగా మారిపోయింది. ఇంటి అప్పు తీర్చుకొనేందుకు ఆ ఇద్దరు మహిళలను వారి భర్తలు.. తమకు అప్పు కోసం తాకట్టు పెట్టేశారు.