ఐటీ, హెల్త్, ఫార్మా, రియాల్టీ… వంటి ఎన్నో కీలక రంగాల్లో ప్రపంచస్థాయి ఖ్యాతి పొందిన హైదరాబాద్ మరో ఘట్టానికి నాంధి పలుకుతోంది. బయో ఏసియా రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు తెలంగాణ అడుగులు వేస్తోంది. ఇంటర్నేషనల్ బయో ఏసియా 2020 సమ్మిట్ కు హైదరాబాద్ వేదికైంది. పెట్టుబడులకు ఊతమిచ్చేలా.. జీవశాస్త్రాల కేంద్రంగా భాగ్యనగరాన్ని నిలపనుందీ సదస్సు.
వరల్డ్ బయో సైన్సెస్‌లో తెలంగాణను అగ్రశ్రేణి కేంద్రంగా నిలిపేందుకు అడుగులు పడుతున్నాయి. ఇంటర్నేషనల్ బయో సైన్సెస్ 2020కి హైదరాబాద్ వేదిక కానుంది. వచ్చే నెలలో మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. సదస్సు నిర్వహణ కోసం స్విట్జర్లాండ్, తెలంగాణ మధ్య భాగస్వామ్య ఒప్పందం కూడా జరిగింది.
ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ ను కలిసిన స్విట్జర్లాండ్ కాన్సులేట్ జనరల్ అధికారులు.. బయో సైన్సెస్ సమ్మిట్‌పై ఒప్పదం చేసుకున్నారు. 2030 నాటికి ఔషద, జీవశాస్త్ర రంగాల ద్వారా 70 వేల కోట్ల రూపాయల ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యంతో తెలంగాణ పురోగమిస్తుందన్నారు ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్.
వచ్చే నెల 17, 18, 19న జరిగే సదస్సులో 50 దేశాలకు చెందిన 2 వేల మందికి పైగా ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను కూడా మంత్రి కేటీఆర్ ఇప్పటికే ప్రారంభించారు. టుడే ఫర్ టుమారో నినాదంతో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
సదస్సు వేదికగా ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులకు ఊతమిచ్చేలా ఎక్స్‌పోలు, ప్రజంటేషన్లు జరగనున్నాయి. ఫార్మా, ఐటీ, రియాల్టీ, హెల్త్ వంటి కీలకరంగాల్లో ఇప్పటికే ప్రపంచ ఖ్యాతి పొందిన హైదరాబాద్ మణిహారంలో… బయో సైన్సెస్ కూడా చేరనుంది. మొత్తానికి ఇంటర్నేషనల్ బయో ఏసియా 2020 సమ్మిట్ తో తెలంగాణ కీర్తి విశ్వవ్యాపితం కానుంది. ఫార్మా, ఐటీ, రియాల్టీ, హెల్త్ లాంటి కీలక విభాగాల్లో నిపుణులు ఇందులో ప్రసంగించనున్నారు. తమ స్ఫూర్తిమంతమైన అనుభవాలతో ఈ సదస్సులో ఎన్నో ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి.