Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Hyderabad Does Not Have Job Security
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతున్న నగరం హైదరాబాద్. ఎన్నో రంగాల్లో వేలాదిగా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓ నానుడి ఉంది. ఒక్కసారి హైదరాబాద్ వెళితే చాలు… ఏదోలా బతికేయొచ్చనేది ప్రతి తెలుగువాడి నమ్మకం. కానీ ఆ నమ్మకం ఉద్యోగాల్లో చేరేదాకే ఉంటుందా..? ఒక్కసారి జాబ్ వచ్చాక అంతా అన్ సెక్యూరిటీయేనా… అవునంటోంది ఓ సర్వే. దేశంలో జాబ్ సెక్యూరిటీ లేని నగరాల్లో హైదరాబాద్ ప్రథమ స్థానంలో ఉంది.
మాన్యుఫాక్చరింగ్ అత్యధిక శాతం మందికి ఉపాధి కల్పించే రంగం. కానీ ఇక్కడ జాబ్ సెక్యూరిటీ చాలా తక్కువట. ఆ తర్వాత మరింతమంది ఉపాధి పొందే రియల్ ఎస్టేట్, కన్ స్ట్రక్షన్ ఫీల్డ్ సంగతి చెప్పక్కర్లేదు. ఇక్కడంతా స్టాక్ మార్కెట్ తరహాలో బూమ్, ఢామ్ పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడు ఎవరు కోటీశ్వరులౌతారో… ఎప్పుడు ఎవరి బికారులౌతారో…తలపండిని నిపుణులు కూడా చెప్పలేరు.
అస్థిర రంగాల సంగతి పక్కనపెడితే… స్థిరమైన వృద్ధిరేటు సాధిస్తున్న ఐటీలో కూడా పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా తమ ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో అన్న భయంతోనే పనిచేస్తున్నారట. హైదరాబాద్ లో టెలికాం, ఇక్కడ పనిచేసే ఉద్యోగులు మాత్రం నిశ్చితంగా పనిచేస్తున్నారని తేల్చింది సర్వే.
మరిన్ని వార్తలు