ఐఎస్‌ఎల్‌లో హైదరాబాద్ టీం

ఫుట్‌బాల్‌

జాతీయ సాకర్‌ జట్టును నడిపించిన గెలిపించిన ఘనత హైదరాబాద్ ఆట గాళ్లదే. ఇప్పటి వరకి జరిగిన మ్యాచ్లల్లో తుది జట్టుకు ఆడినవారిలో 8నుండి 10మంది మన హైదరాబాద్‌ వాళ్ళే ఉన్నారు. దీనితో భారత ఫుట్‌బాల్‌ లో హైదరాబాద్‌ ఆటగాళ్లకు ప్రత్యేక స్థానం ఉంది.

కొంత కాలంగా హైదరాబాద్ ఆట గాళ్లకి భారత ఫుట్‌బాల్‌ జట్టులో చోటే దొరకగా పోగా ఇన్నాళ్లకు ఐఎస్‌ఎల్‌-ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ద్వారా హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ ముందుకు వచ్చింది.

అప్పట్లో విక్టర్‌ అమల్‌రాజ్‌ కెప్టెన్గా ఉన్న సమయంలో ఎస్‌.ఎ.రహీమ్, పీటర్‌ తంగ రాజ్‌ లాంటి ఆటగాళ్లు ఎనలేని సేవలు అందించిన రాను రాను హైదరాబాదీలు వెనుకపడిపోయారు.

ఫ్రాంచైజీ సహ యజమాని వరుణ్‌ త్రిపురనేని మాట్లాడుతూ కోచ్‌ ఫిల్‌ బ్రౌన్‌ వల్ల ఈ సీజన్‌లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ రాణించి ప్రేక్షకుల మెప్పు పొందుతుందని తెలిపారు.

మొదటి నుండి ఐఎస్‌ఎల్‌లో పుణే ఉండగా ఆర్థిక పరమైన ఇబ్బందుల వల్ల పుణే ఫ్రాంచైజీ తప్పుకోవడం వల్ల హైదరాబాద్‌కు చాన్స్‌ దక్కింది. వచ్చే సీజన్‌ లో హైదరాబాద్ వాళ్ళకి చోటు దక్కనుంది. ఈ సారి మాత్రం పుణే ఎంపిక చేసుకున్న ఆటగాళ్ళే ఆడనున్నారు.