విశ్వనగరంగా కీర్తించబడుతున్న హైదరాబాద్ మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన, ఉపాధి, తదితర అంశాలపై 34 నగరాల్లో జరిపిన సర్వేలో హైదరాబాద్ అత్యత్తమమైన నగరంగా నిలిచింది. హాలిడిఫై.కామ్ నిర్వహించిన ఈ సర్వేలో ప్రజలు భాగ్యనగరానికి పట్టం కట్టడంతో 34 అత్యుత్తమ పట్టణాలలో హైదరాబాద్ నంబర్ వన్‌గా నిలిచింది.
అయితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక రికార్డులతో హైదరాబాద్ అన్ని విధాలా దూసుకుపోతుంది. అయితే పలు దేశాల, రాష్ట్రాల ప్రజలకు స్థానం కల్పిస్తూ, విభిన్న సంస్కృతుల కలబోతగా నిలుస్తున్న పట్టణాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించినట్టు తెలుస్తుంది. మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, సుస్థిరావృద్ధి, ఆర్థిక వ్యవస్థ మొదలైన అంశాల ప్రాతిపదికన సర్వే జరపగా ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై వంటి పలు ప్రధాన పట్టణాలను వెనక్కి నెట్టి హైదరాబాద్‌కు 5 పాయింట్లకు 4 పాయింట్లు వచ్చినట్టు తెలుస్తుంది.