కత్తి మహేష్‌కు రివర్స్‌ కౌంటర్‌ వేసిన ఆది

hyper aadi reverse counter on kathi mahesh

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

జబర్దస్త్‌ షోలో ఆది ఇటీవల కత్తి మహేష్‌ గురించి కౌంటర్‌ వేసిన విషయం తెల్సిందే. పొట్ట, బట్ట అంటూ కత్తి మహేష్‌ రూపంపై విమర్శలు చేశాడు. ఆది తన స్కిట్‌లో తన గురించి అసభ్యంగా మాట్లాడటం, పంచ్‌లు వేయడంపై కత్తి మహేష్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక వీడియోను పోస్ట్‌ చేశాడు. ఆదిపై ఒక ఇంటర్వ్యూలో కూడా కత్తి మహేష్‌ తన ఆగ్రహంను వ్యక్తం చేశాడు. ఆదికి పవన్‌ ఫ్యాన్స్‌ బాసటగా నిలిచి కత్తి మహేష్‌పై మరింతగా విమర్శలు చేశారు. ఈ సమయంలోనే కత్తి మహేష్‌, ఆదిలు ఒక సినిమా ప్రివ్యూ షోలో పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఇద్దరు కలిసి ఫొటో తీసుకున్నారు.

hyper aadi strong counter to kathi mahesh,

ఆ ఫొటోను కత్తి మహేష్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసి మేము మేము ఒకటి అంటూ కామెంట్‌ పెట్టాడు. మద్యలో వెదవలు అయ్యేది ఫ్యాన్స్‌ అని, పవన్‌తో కూడా ఎప్పుడో ఇలా ఫొటో దిగుతాను, ఫ్యాన్స్‌ ఇప్పుడైనా మారండి అంటూ కత్తి మహేష్‌ సలహా ఇచ్చాడు. కత్తి మహేష్‌ పెట్టిన ఫొటోపై ఆది ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేము మేము ఒకటి అంటే నీతో నన్ను కలుపుతావేంటీ, నీవు ఏమైనా సెలబ్రెటీవా అంటూ కత్తి మహేష్‌పై ఆది ఆగ్రహం వ్యక్తం చేశాడు. నీకు అంత సీన్‌ లేదు. సెల్ఫీలు తీసుకోవాలని అభిమానులు వెంటపడితే సెలబ్రెటీలు అవుతారు, కాని కనిపిస్తే కొట్టాలని జనాలు అనుకుంటే వారు సెలబ్రెటీలు కారు అంటూ కత్తి మహేష్‌ను ఉద్దేశించి ఆది అన్నాడు.