పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించాక భవిష్యత్తు గురించి అస్సలు ఆలోచించకుండా తనకు ఏది అనిపిస్తే అది చేస్తూ.. నోటికి ఏమి వస్తే అది మాట్లాడుకుంటూ తన ఫ్యాన్స్ కు సంతోషాన్ని ఇస్తున్నాడు. ఇక అదే విధంగా కృష్ణా జిల్లాలో జరుగుతున్న బహిరంగ సభలోనూ పవన్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
పవన్ ఊగిపోయి మాట్లాడుతూ… జగన్ నువ్వు ఎవరితోనైనా పెట్టుకో, నేను మాములు వ్యక్తిని కాదని, రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మీ నాన్న ముఖ్యమంత్రిగా వుంటే ఆయనతోనే గొడవ పెట్టుకున్న మొండివాడినంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఆ గొడవకు మా ఆఫీస్ పై మీ నాన్న దాడి చేయిస్తే స్టాఫ్ అందరూ పారిపోయినా నేను ఒక్కడినే అక్కడే కూర్చున్నానంటూ గతాన్ని గుర్తు చేస్తూ జగన్ కు అర్థమయ్యేలా పవన్ చెప్పాడు. మీలాంటి గుండాలకు, కిరాయి రౌడీలకు భయపడీపోవడానికి నేను సదా సీదా మనిషిని కాదు దేశభక్తుడిని.. నా లాంటి దేశభక్తులతో పెట్టుకుంటే తొక్కి నారా తీస్తాం అంటూ పవన్ మాస్ డైలాగులు పలికాడు.