వైసీపీ లో సీనియర్ నేత, జగన్ కు బంధువు అయిన వైవి సుబ్బారెడ్డి కి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారనుంది. ఏపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ గా పని చేసిన వైవి సుబ్బారెడ్డి జగన్ కు చాలా నమ్మిన వ్యక్తిగా పార్టీలో గౌరవ మర్యాదలను అందుకుంటున్నారు. సజ్జల రామకృష రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వైఎస్ విజయ సాయి రెడ్డి లు ఒకే విధంగా వ్యక్తులుగా జగన్ ను అండగా ఉంటున్నారు. గతంలో వైవి సుబారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఆ మధ్యన ఇంటర్ వ్యూ లలో సైతం ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి తనకు లేదని చెప్పిన విషయం తెలిసిందే. కానీ తాజాగా తెలుస్తున్న ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆయనే ప్రకటించారు.
ప్రస్తుతం ఈ విషయం ఏపీలో చర్చనీయాశం అయింది. ఎందుకు సడెన్ గా ఈ నిర్ణయం వైవి తీసుకున్నాడు, నామినేటెడ్ పదవులు తీసుకోవడం ఇష్టం లేకనే.. రాజకీయ బద్దంగా గెలిచి మంత్రిగా అవ్వాలని చూస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.