జనసేన పార్టీ నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొద్దిరోజులుగా పార్టీకి దూరంగా ఎందుకు ఉంటున్నారు. ఆయన బీజేపీలోకి వెళ్తున్నారా. జనసేన కమిటీల్లో జేడీ పేరు ఎందుకు కనిపించలేదు. అధినేత పవన్ కళ్యాణ్, జేడీ మధ్య విభేదాలతో అంటీముట్టనట్లు ఉంటున్నారు.
కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇలా ఉంది. దీంతో లక్ష్మీనారాయణ స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మీడియా మీద విరుచుకుపడ్డారు.
ట్విట్టర్లో స్పందించిన జేడీ ‘ఉదయం నుంచి నాపై వస్తున్న రూమర్ల గురించి తెలిసి ఆశ్చర్యపోయాను, షాకయ్యాను. కొంతమంది నేనంటే నచ్చని వాళ్లు రూమర్లు మొదలు పెట్టారు.
వాటిని కొందరు ఫూల్స్ ప్రచారం చేశారు.. ఆ రూమర్లను కొందరు ఇడియట్స్ నమ్మేశారు. ఏ కేటగిరి కిందకు వస్తారో వాళ్లే నిర్ణయించుకోవాలి’అంటూ ఘాటుగా స్పందించారు. మరో ట్వీట్లో ‘నా సేవలు పార్టీకి పనికొస్తాయని అధినేత భావించినంత కాలం జనసేనతోనే ఉంటాను.
ఇలాంటి రూమర్లు ప్రచారం చేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. అదేదో వరదలపై, మొక్కల పెంపకం, మనం ఉండే ప్రదేశాల నుంచి ప్లాస్టిక్ తొలగింపు, యువకుల్ని మేలుకొల్పడం వంటి పనులపై శ్రద్ధ పెడితే మంచిది.. జై హింద్.. మీ లక్ష్మీ నారాయణ’ అన్నారు.
I will be with Janasena till the President feels that I’m useful to the party.
Please don’t waste time on such rumours and rather use it for helping the flood affected, planting saplings, clearing areas of plastic, motivating youth and many more.
Jai Hind.– VV Lakshmi Narayana
— V. V. Lakshmi Narayana (JD) (@VVL_Official) August 10, 2019