Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నోట్ల రద్దు మొదలుకుని నిన్న మొన్నటి జీఎస్టీ వరకు ఎన్నో ప్రజా వ్యతిరేకత వచ్చే పనులు చేసి వారి వ్యతిరేకతకి గురయినా ఇప్పుడు కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తోంది. అయితే ఇప్పుడు ఈ కన్నడ నాట విజయమే బీజేపీ కొంప ముంచ నుందా అనే అనుమానాలని విశ్లేషకులు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే బీజేపీకి మొదట నుండి కన్నడ అసెంబ్లీ ఎన్నికలతో అవినాభావ సంబంధం ఉందని చెప్పుకోవాలి. ముందు కర్నాటక అసెంబ్లీ ఎన్నుకలు రావడం సరిగ్గా ఏడాదికి సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఒక రకంగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు దేశ సార్వత్రిక ఎన్నికలకి రిజల్టింగ్ ఫ్యాక్టర్ గా మారాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.
అయితే ఇప్పుడు గెలిచి ఆనందంలో సంబరాలు చేసుకుంటున్న బీజేపీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలవబోతోందా ? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. వారి వాదన ప్రకారం తొలిగా 2004లో అన్ని రాష్ట్రాలతో కలిసి అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళిన కర్నాటక, యడ్యురప్ప సిఎం అయ్యాక కొన్ని కారణాల వల్ల అసెంబ్లీ రద్దు చేశారు. దీంతో 2008లో మరలా కర్నాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా అధికారంలోకి వచ్చింది. కానీ ఆ వెంటనే 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికార పీఠాన్ని దక్కించుకుంది. బీజేపీకి చెందినా ఎన్డీయే కూటమి నామరూపాల్లేకుండా ఓడిపోయింది.
అలాగే 2013 లో కర్నాటకకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికార పీఠాన్ని దక్కించుకుంది. అప్పుడు కాంగ్రెస్ నామరూపాల్లేకుండా ఓడిపోయింది. 1999 మేలో కేంద్రంలో బీజేపీ గెలిస్తే… అదే సంవత్సరం అక్టోబరులో జరిగిన ఎన్నికల్లో కర్నాటకలో బీజేపీ ప్రభావం ఏ మాతం లేకపోవడం, అక్కడ కాంగ్రెస్ గెలుపొందడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే కర్నాటకలో గెలిచిన వారు కేంద్రంలో ఉండరు. సో ఈ సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు 2018లో కర్నాటకలో మరోసారి బీజేపీ గెలిచింది కాబట్టి ఇక బీజేపీ రానున్న ఎన్నికల్లో మట్టి కరవడం ఖాయమనే మాట వినపడుతోంది. అయితే ఈ సెంటిమెంట్ ఎంతవరకు నిజమవుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం.