నన్ను ఆపితే హాలీవుడ్‌కు వెళ్తా.. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

నన్ను ఆపితే హాలీవుడ్‌కు వెళ్తా.. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
Cinema News

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించిన మూవీ యానిమల్. ఈ మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా నటించింది. అయితే ఈ మూవీ లో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందని పలువురు సెలబ్రిటీలు విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ నేపథ్యంలో డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తనను ఇండియాలో మూవీ లు తీయనీయకపోతే హాలీవుడ్కు వెళ్లిపోతానని ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అన్నారు. ‘నాకు భాషా పరిమితులు లేవు. ఏ భాషలోనైనా మూవీ తీస్తా అని తెలిపారు. నా సినిమా ని ప్రేక్షకులు విమర్శిస్తే పెద్దగా పట్టించుకోను. కానీ అన్నీ తెలిసిన సెలబ్రిటీలూ నన్ను విమర్శిస్తున్నారు. అదే బాధగా ఉంది’ అని పేర్కొన్నారు.

నన్ను ఆపితే హాలీవుడ్‌కు వెళ్తా.. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా
Sandeep Reddy Vanga

బాబి డియోల్, అనిల్ కపూర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.డిసెంబర్ ఒకటవ తేదీన విడుదలైన యానిమల్ మూవీ 900 కోట్ల భారీ వసూళ్లను సాధించింది.ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ వేదికగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల అయ్యింది.