TG Politics: మాజీ సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు చెప్పిన గవర్నర్ తమిళి సై

TG Politics: Former CM KCR was congratulated by Governor Tamili Sai
TG Politics: Former CM KCR was congratulated by Governor Tamili Sai

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్. BRS పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి KCR జన్మదినం సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కార్యాలయం నుండి వచ్చిన ప్రతినిధి తెలంగాణ భవన్ లో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పుష్పగుచ్ఛం, శుభాకాంక్షల లేఖను అందజేశారు.

కాగా, తెలంగాణ మొట్ట మొదటి సీఎం కేసీఆర్‌ బర్త్‌ డే నేడు. మాజీ సీఎం KCR ఫిబ్రవరి 17, 1954లో సిద్దిపేట సమీపంలోని చింతమడక గ్రామంలో జన్మించారు. చదువులో చురుగ్గా ఉన్న ఆయన రాజకీయాలపై ఆసక్తితో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. 1983లో TDPలో చేరి 1985 నుంచి ఓటమి ఎరుగని నేతగా నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా 2001లో TRSని స్థాపించారు. మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణకు తొలి సీఎంగా 9 ఏళ్ల పాటు సేవలందించారు. కేసీఆర్‌ బర్త్‌ డే నేడు ఉన్న తరుణంలోనే.. తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నారు.