TG Politics: నేడు కేసీఆర్‌ జన్మదినం.. ప్రపంచవ్యాప్తంగా వేడుకలు

TG Politics: Today is KCR's birthday.. Celebrations all over the world
TG Politics: Today is KCR's birthday.. Celebrations all over the world

తెలంగాణ మొట్ట మొదటి సీఎం కేసీఆర్‌ బర్త్‌ డే నేడు. మాజీ సీఎం KCR ఫిబ్రవరి 17, 1954లో సిద్దిపేట సమీపంలోని చింతమడక గ్రామంలో జన్మించారు. చదువులో చురుగ్గా ఉన్న ఆయన రాజకీయాలపై ఆసక్తితో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. 1983లో TDPలో చేరి 1985 నుంచి ఓటమి ఎరుగని నేతగా నిలిచారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా 2001లో TRSని స్థాపించారు. మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణకు తొలి సీఎంగా 9 ఏళ్ల పాటు సేవలందించారు. కేసీఆర్‌ బర్త్‌ డే నేడు ఉన్న తరుణంలోనే.. తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నారు.

ఇక అటు కేసీఆర్‌ 70వ పుట్టిన రోజు సందర్భంగా ఒక్కొక్కరూ 3 మొక్కలు నాటాలని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. లెజెండ్‌ పుట్టిన రోజున పచ్చటి మొక్కలు నాటుదామని ఆయన అన్నారు. తెలంగాణ జాతిపితను గౌరవించాలంటే మాతృభూమిని పోషించడం కంటే గొప్ప మార్గం ఏముందని సోషల్ మీడియా వేదికగా సంతోష్‌ కుమార్‌ పేర్కొన్నారు.