ఫోకస్ అంతా సినిమాల పైనే పెట్టిన గోవా బ్యూటీ

ఫోకస్ అంతా సినిమాల పైనే పెట్టిన గోవా బ్యూటీ

గోవా బ్యూటీ ఇలియానా పాత విషయాలన్నీ మరచిపోయానని చెప్పుకొస్తుంది. వెండితెర అవకాశాలు నిండుగా ఉన్న సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన ఫోటో గ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమలో పడి అవకాశాలన్నీ చేజార్చుకుంది.ఇద్దరు పెళ్లి వరకు వెళ్లారు. కానీ ఏమైందో ఏమో గాని ఈ ఏడాది ఆగస్టులో ఇలియానా-ఆండ్రూ విడిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులుగా ఖాళీగా గడిపిన ఈ భామ ప్రస్తుతం తన ఫోకస్ అంత సినిమాల ఫై పెడుతుంది.

తన ఫిజిక్ ను స్లిమ్ చేస్తూ సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫొటోస్ తో రచ్చ చేయడం స్టార్ట్ చేసింది. తాజాగా మీడియా వారు ప్రేమ విషయం గురించి అడుగగా ఇప్పుడు పాత విషయాలు ఎందుకు అవన్నీ ఎప్పుడో మరచిపోయా ప్రస్తుతం నా ఫోకస్ అంతా వర్క్ మరియు కెరీర్ పైనే అని చెప్పారు. అలాగే నా ఆహార అలవాట్ల విషయంలో మార్పులు చేశానని, గతంతో పోల్చితే ఇప్పుడు హెల్తీ మరియు ఫిట్ గా ఉన్నాను, అని చెప్పుకొచ్చింది.