తెలంగాణలో నమ్మకద్రోహం… ఆపై హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అసలు విషయం ఏమిటంటే.. వాళ్లిద్దరిదీ 15 ఏళ్ల స్నేహబంధం. తరచుగా స్నేహితుడి ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే అతడి చూపు స్నేహితుడి భార్యవైపు మళ్లింది. అలా ఆమెతో మాటలు, పరిచయాలు పెరిగాయి. దాంతో కొన్ని రోజులకే అదే వివాహేతర సంబంధానికి దారితీసింది. అలా స్నేహితుడు లేని సమయంలో అతడి ఇంటికి వచ్చి వెళ్తుండటం భర్తకు అనుమానం వచ్చింది. దీంతో ఇది పద్ధతి కాదని భార్యకు, ఆ స్నేహితుడికి వార్నింగ్ కూడా ఇచ్చాడు.
అయితే అలా ఏం చెప్పినా వినిపించుకోలేదు. దీంతో తాజాగా ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇంటికి మకాం మార్చాడు. అక్కడికి కూడా స్నేహితుడు వస్తుండేవాడు. తన భార్యతో స్నేహితుడి రాసలీలను అతడు భరించలేకపోయాడు. దీంతో స్నేహితులకే సుపారీ ఇచ్చి హత్య చేయించాడు.
కాగా ఈ ఘటన ఓ సారి ఎలా జరిగిందో చూద్దాం. ఘటకేసర్ సమీపంలోని మున్సూరాబాద్‌కు చెందిన మదరమోని సైదులు, అదే కాలనీకి చెందిన ఆలకుంట యాదగిరి మంచి స్నేహితులు. తాజాగా మే నెలాఖరులో ఆదర్శనగర్‌లో ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇంటికి యాదగరి మకాం మార్చాడు. కానీ సైదులు వారి భార్యకోసం అక్కడికీ వచ్చి వెళ్తుండటంతో.. ఇలా వదిలేస్తే లాభం లేదని యాదగిరి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. భార్య వివాహేతర సంబంధాన్ని అవమానంగా భావించిన అతడు స్నేహితుణ్ని హతమార్చాలనే నిర్ణయానికి వచ్చేశాడు. ఘట్‌కేసర్‌లోని మైసమ్మగుట్ట కాలనీకి చెందిన మిత్రులు మహిపాల్, శివకు విషయాన్ని చెప్పాడు. సైదుల్ని హతమారిస్తే లక్ష రూపాయలు ఇస్తామని చెప్పాడు. దీంతో పక్కా స్కెచ్ వేసి జూన్ 19న సైదులును పిలిచి మైసమ్మగుట్ట సమీపంలోని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి మద్యం తాగాడు. మద్యం మత్తులో ఉన్న సైదులును కత్తులతో పొడిచి హత్య చేశారు. మెల్లగా అక్కడి నుంచి పారిపోయారు. ఈ కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు సోమవారం ఘటకేసర్‌లో యాదగిరిని, మరో ఇద్దరు నిందుతులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో సీఐ పి.రఘువీర్‌రెడ్డి, ఏసీపీ వై.నరసింహారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.